చుట్టపు చూపుగా వచ్చావు నీవు
చుట్టింది చాలులే ఇక బయలుదేరు
ఎన్నిరోజులని పోషించాలి నిన్ను
మా వల్ల కాలేదు మర్యాదగా వెళ్ళు..

కనికరం లేక కడతేర్చుతున్నావు
కాస్తయినా ఆపవా నా బుజ్జి కరోనా
నీ నుంచి మమ్మల్ని కాపాడే పనిలోన
మా మంచి మనసున్న మా రాజులందరిని
మా నుంచి దూరం చేయకే ఇకనైనా....

నిదుర పోకున్నా నిదుర పోతున్నా
మా కనుల ముందరే నాట్యo చేస్తున్నావు
ఎన్ని రోజులని నీ నాట్యం చూసేము
ఎంత త్వరగా నీవు తెరవేసి వెళతావు..
అవునుమరి
గుడ్నైట్ గాని ఆల్ అవుట్ గాని
మా కివ్వనంటుంది మనఃశాంతి నేమో

సర్కారీ మాటలను మీరు చక్కగా పాటిస్తే
నేనేమో మీ కనులకు కానరాక పోతాను....

కనులు మూసినా నీవాయే
మరి కనులు తెరిచినా నీవాయే
కలలో నైనా నీవాయే
మరి అందరి ఎదలు బేజారాయె...

లాక్ డౌన్ వున్నా కూడా
రాకపోకలెక్కువే
సామాజిక దూరం మాత్రం
పాటించక పోతున్నాం
ఎన్నివిధాలా చెప్పినా ఈ
చెవిటి మా లోకానికి
ప్రయోజనం లేదన్నదే
జగమెరిగిన వాస్తవం....

సాయంత్రం ఆరైతే
ఆరుబయటనే జనం
ఒక్కుమ్మడిగా కూర్చుండి
బాతాఖానీ చేస్తుండ్రు
కరోనాపై భయం లేదు
నాయకుల మాటలపై విలువలేదు
మనదాకా వస్తేను అప్పుడేమో చూద్దాము
అంటూ
కాలం వెళ్లదీస్తున్న జనాలకు
ఏమాత్రం జ్ఞానోదయం అన్నది
ఇప్పటికీ రాలేదు....

సర్కారీ మాటలు ఇనకపోయే
కనీసజ్ఞానం కరవైపోయే.
కనువినీ ఎరుగని కష్టాలాయే
కాళహస్తి జనులు భయంతో ఉన్నారాయె...

కనీస జ్ఞానం కరవైపోయే
కనీవినీ ఎరుగని కష్టాలా యే
సర్కారీ మాటలు ఇన్నామాయె
కలసికట్టుగా ఉన్నమాయె
కరోనాపై గెలిచామాయె..

పనున్నా లేకున్నా
రోడ్లపైనే ఠికానా
తనదాకా రాలేదని
చెప్పుకుంటూ తిరిగినా
ఎవ్వెరెన్ని చెప్పినా
జనాంతీరు మారదన్నా...

ఏలే వారి మాటలను ఎన్నటికీ ఇనుకోరు
ఏమరుపాటుగా ఉంటే ఏడికైనా పోతారు
ఎంతమందికని ఏకరువు పెడతారు
ఎంత చేసినా ఎదవలు ఏ మాత్రం మారలే
ఇంటిలోని పెద్దలే ఇవ్వాలి శిక్షలే...