అమ్మాయి : ప్రేమించిన మనిషితో జీవించాలనే ఆశ...
నా జీవితంలో ఆశగానే మిగిలిపోతుంది..,
ఈ కన్నె ప్రేమకు, కన్న ప్రేమ అడ్డమై విడదీస్తుంది.
ఏం చేయాలో నాకు తోచడం లేదురా...
అబ్బాయి : మనసుకు ప్రేమించే హక్కు ఉంది కానీ...,
కలిసి జీవించడానికి ఎందరో అనుమతి కావాలి...
మంచు మేఘంలా... ప్రేమ అంచులా దాకా తీసుకెళ్లి...
నా జీవితంలో... నీ జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తున్నావ్..,
మరుజన్ముంటే... నీ జీవితంలోనే కాదు..,
నీ చావులో కూడా సగమవ్వాలని... కోరుకుంటా...
నువ్వు ఎక్కడున్నా... నా మనసు నీతోనే ఉంటుంది...