internetPoem.com Login

వలసల బ్రతుకులు

Rajagopalan V.T

పట్నమొచ్చినాము మేము పట్నమొచ్చినాము
బతుకు తెరువు కోసమని పట్నమొచ్చినాము
సొంత ఊరు వదలి మేము చుట్టాలననొ దలి మేము
వయసొచ్చిన వారినొదలి వయసైనా వారినొదలి
కరోనా భయం తోనే కఠినరాయి గుండెతోనే
మారాజులు కొందరేమో మెడబెట్టి గెంటినారు
దళారీల మాటలపై నమ్మకాలు వదలి మేము
సొంతూళ్లకు బయలుదేరి నడి రోడ్డున పడ్డాము
మనసున్న మారాజులు మమ్మల్ని చేరదీసి
మనిషికంత కూడు పెట్టి మనసుకంత దగ్గరాయె
బుధ్ధివచ్చెనన్న మాకు బుద్ధి వచ్చెను
సొంత ఊరు విడిచి ఎక్కడికెళ్లరాదని...

(C) Rajagopalan V.t
04/28/2020


Best Poems of Rajagopalan V.T