internetPoem.com Login

దవాఖానా దేవుళ్ళు

Rajagopalan V.T

అలసట ఉన్నా
ఆప్యాయతతో ఆదరిస్తూ
ఇంటిని మరచి
ఈడనే ఉన్నాం
ఉత్సాహంతో ముందుండి
ఊయల పిల్లల నొదలి మేము
ఎదలోని అలజడులను
ఏకంగా తరిమి కొట్టి
ఐకమత్యమై మేము
ఒక్క మాట మీద నిలిచి
ఓర్పుగా వారికి
ఔషధాలనిచ్చి మేము
అందరిలోనూ ధైర్యం నింపి
అహర్నిశలు వారిని కాపాడేందుకు
కృషి చేస్తున్నాము...

(C) Rajagopalan V.t
04/28/2020


Best Poems of Rajagopalan V.T