నా కలల సుందరి.

బుజ్జీ బుజ్జిగా ముద్దోచే బుగ్గలు..,
వయ్యారాలు వలగ బోసే కురులు ..,
కాంతులు విరజిమ్మే కనులు ..,
ఇంద్రధనుషు లాంటి కనుబొమ్మలు..,
లేలేత పాల మీగడ లాంటి పెదవులు..,
సంగీత ద్వనులిచ్చే శంఖం లాంటి చెవులు..,
మంచు మేఘంలా మనసును మైమరపించే మోము..,
నాట్యమాడే నెలవంక లాంటి నడుము..,
అంద చందాలతో కూడిన ఒంపు సొంపులు..,
ముట్టుకుంటే కందిపోయే అందం నీది..,
అందమైన ఆ ప్రకృతి కూడా...
నీ అందం చూసి అసూయతో అలుగుతుందేమో...,
కొంచం దాచి పెట్టావా... ప్లీజ్...
ప్లీజ్... కొంచెం దాచెయ్....

Siva Sashi
(C) All Rights Reserved. Poem Submitted on 09/03/2020

Poet's note: దివి నుండి భువికి దిగి వచ్చిన నా కలల సుందరి అందం....
The copyright of the poems published here are belong to their poets. Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.