మాయదారి డబ్బు.
పల్లవి :
మనిషి చేసిన డబ్బురా... మనిషిని మార్చేసేరా...
మనిషి మైండ్ చూడరా... మనీ మైండ్ అయెరా...
మందు కన్న కిక్ ఇచ్చే మనీ స్మెల్ చూడరా..,
మాయదారి డబ్బురా... మనకి కావాలిరా...
చరణం 1 :
డబ్బుంటే ధనికుడురా... దర్జాగా బతుకుతడు..,
రాజ్యంలో రారాజులా... ఉంటాడు రా... 2"
డబ్బు లేకుంటే, రాజ్యంలో చోటే లేదు..,
బతుకు మీద ఆశ తనకు లేనేలేదు...
బతుకే బరువైందిరా... బతకడమే బాధ్యతని అనుకుంటాడు... మనిషి "
చరణం 2 :
డబ్బుండి... లేకుంది... ఉరికురికి పడుతుంది...
ఉర్రుతలు ఊగుతుంది... మిడిల్ క్లాస్ ఫ్యామిలీ...
మంచి మర్యాలకి... మారుపేరురా...
అందరిని ఆదరించి, ప్రేమతో పలకరించి..,
తోచిన సాయం చేసే గొప్ప మనసురా...
ఈ మద్య తరగతీ... కుటుంబమే... ఒక మాయాచిత్రం లాంటిదిరా... మనిషి... "
Siva Sashi
(C) All Rights Reserved. Poem Submitted on 09/09/2020
Poet's note: డబ్బు చేసిన మాయా...
The copyright of the poems published here are belong to their poets.
Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.