సోధో యమ్మ సోధి

సోధి సెబుతానండి సోధి సెబుతాను
కంచి కామాక్షమ్మ మధుర మీనాక్షి
కరుణించవే మమ్ము కనకదుర్గమ్మ
పలికించు నా మాట సత్యంబుగాను
ఉన్నది ఉన్నట్లు మీ కెరుక జేస్తాను
ఇనుకోండి నా మాట నా దేశ జనులారా. "సోధి "

లాక్డౌన్ తీశాక రోడ్డుమీదకీ రాక
తగ్గిస్తేనే బతుకు బాగుండేమో
ఇల్లిడిచి మనమొస్తే ఏ వేళకైనా
మూతికి మూరెడు గుడ్డేమో కట్టాలి "సోధి "

సర్కారీ మాటలు సక్కగా ఇనుకోండి
రోడ్డుపై కుప్పలు కుమ్మరించక సూడు
రోడ్డుపై ఎవరినీ ఉమ్మనీక సూడు
పరిశుభ్రతే మనకు ఆరోగ్యమాయె "సోధి "

ఖార్మీకులు ఖాకీలు రోడ్డు పట్టారాయె
మనల్ని కాపాడు దేవుళ్ళు వారాయె
దవాఖానాల్లేమో దేవాలయాలయే
పనిసేయు వారేమో దేవుళ్లుగా మారే
మరి వారికి దండాలు పెట్టాకా పోయే
వారికి కష్టాలు కలిగించ మాకు "సోధి "

ఇక మనమంతా బుద్దిగా నడవాలి ముందుకు
దేశ ప్రగతికి ముందడుగు వేద్దాం
సర్కారీ మాటలను నిజాలు చేద్దాం "సోధి "

Rajagopalan V.t
(C) All Rights Reserved. Poem Submitted on 04/28/2020 The copyright of the poems published here are belong to their poets. Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.