స్నేహ హస్తం
బాపట్ల బిడ్డేమో ఏనాడో చెప్పేను
భరత బిడ్డడేమో ఈనాడు చేసేను
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించే మననేల విజ్ఞాన కిరణాలు
దేశాల చీకట్లు తొలగించె
స్నేహ హస్తాన్ని అందరికి అందించె
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించె
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
అని ఎలుగెత్తి చాటావు..
ఎక్కడున్నాడో కాని రాయప్రోలు వారు
తప్పక ఆస్సీస్సులు అంద జేస్తారు...
Rajagopalan V.t
(C) All Rights Reserved. Poem Submitted on 04/28/2020
The copyright of the poems published here are belong to their poets.
Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.