అభ్యుదయం
అభ్యుధయo మోడి రధం కదిలెను మనతో
సారధి సాధన పరిగెడి మనతో "ఓ అభ్యుదయం "
రాష్ట్రాల సారధులు ఎత్తే ధ్వజం
చేదోడై సాగిరి అధికారులు
మనసున్న మా రాజులు అండగా నిలిచి
అభ్యుదయం వైపునకు పరిగెడి రథమే "ఓ అభ్యుదయం "
పారిశుద్ధ్య ఖార్మీకులు పరిశుభ్రతకు
పోలీస్ శాఖ మొత్తమ్ మన రక్షణకు
దవాఖానా దేవుళ్లేమో మన సేవలకు
చేరిరి ఒక్కటిగా పరిరక్షణకు "ఓ అభ్యుదయo"
గ్రామ పెద్దలు మరి జనులందరూ
చేరిరి చెట్టుకింద ఒక్కుమ్మడిగా
నాయకులు చెప్పినవి ఆచరించిరి
సామాజిక దూరాన్ని పాటించిరి "ఓ అభ్యుదయo"
పేదలను కాపాడు దైవము లంతా
ఒక్కటై చేయూతను అందించగా
పెద్ద పెద్ద ధనవంతులు ఒక్కటాయేనే
అందరికీ ఆదర్శం అయ్యారండి... "ఓ అభ్యుదయం "
Rajagopalan V.t
(C) All Rights Reserved. Poem Submitted on 04/28/2020
The copyright of the poems published here are belong to their poets.
Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.